15 May, 2026 | 11:37 AM

Breaking News

నేరడిగొండ, బజార్హత్నూర్ మండలాల్లో జొన్నల కొనుగోలు ప్రారంభం   •   గన్ని బ్యాగుల కొరత.. పంట తరలింపులో జాప్యం రోడ్డెక్కిన అన్నదాత   •   సనాతన ధర్మంపై చేసిన వ్యాఖ్యలపై ఉదయనిధి స్పష్టత   •   NEET UG 2026 రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు   •   మైనర్ బాలికపై లైంగిక దాడి..   •   వాహన దారులకు షాక్.. దేశవ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు   •   యూసుఫ్‌గూడలో అగ్నిప్రమాదం   •   మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ అధ్యక్షునిగా కొడారి మల్లేష్ యాదవ్, ప్రధాన కార్యదర్శిగా మహావాది సతీష్ కుమార్   •   యువతను వ్యసనాలకు దూరం చేసేందుకే క్రికెట్ టోర్నమెంట్   •   గ్రామాల్లో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే 100కు డయల్ చేయాలి   •  

మీకు అదే గతి.. నన్ను అరెస్ట్ చేస్తే చేసుకోండి

23-12-2025 02:38 PM

మీకు అదే గతి

మాది త్యాగాల చరిత్ర.. అరెస్టులకు భయపడం

హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో(Phone tapping case) నోటీసుల వార్తలపై మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు(Harish Rao) స్పందించారు. రాష్ట్రంలో సిట్ లు ఒక ప్రవాసనం అయ్యాయని చెప్పారు. డిఫెన్స్ లో పడింది కాబట్టి నాకు నోటీసులు ఇస్తారట అన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగిసే 3వ తేదీ సాయంత్రం నోటీసు ఇవ్వమని చెప్పారట అన్నారు. కొందరు అధికారులు పోస్టింగుల కోసం అక్రమ కేసులు పెట్టాలని చూస్తున్నారని తెలిపారు. రేవంత్ రెడ్డి మెప్పుకోసం అతి చేస్తే మూల్యం చెల్లించుకుంటారని హరీశ్ రావు పేర్కొన్నారు. ఏపీలో ఏం జరిగిందో అందరూ చూశారు కదా అన్నారు. రాజకీయ కక్షతో ఇబ్బంది పెడితే మీకు అదే గతి పడుతుందని హెచ్చరించారు.

మాకు త్యాగాల చరిత్ర ఉంది, అరెస్టులకు భయపడేది లేదని ఆయన స్పష్టం చేశారు. అరెస్టు చేస్తే చేసుకోండి, ఇంకా రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తామని తెలిపారు. అతిగా వ్యవహరించే అధికారుల పేర్లు బుక్ లో రాస్తున్నామని సూచించారు. అక్రమాలు, అరాచకాలు, సెటిల్ మెంట్లు అన్నీ నమోదు చేస్తున్నామని వెల్లడించారు. బీఆర్ఎస్ పట్ల కక్ష పూరితంగా వ్యవహరిస్తున్న వారిని గమనిస్తున్నామని వివరించారు. అతిగా వ్యవహరించే పోలీసు అధికారులను వదిలిపెట్టేది లేదన్నారు. రిటైర్ అయినా, విదేశాల్లో ఉన్నా, కేంద్ర సర్వీసులకు వెళ్లినా పట్టుకొస్తామని హెచ్చరించారు.