23 April, 2026 | 9:49 AM

తుమ్మిడిహట్టిపై హరీశ్‌ది అసత్య ప్రచారం

20-09-2025 12:30 AM
  1. అతి తెలివి ప్రదర్శిస్తే అభాసుపాలవుతారు
  2. ఇంకా అంచనాల ప్రక్రియే ప్రారంభించలేదు
  3. హరీశ్‌రావు ఎలా నిర్థారణకు వస్తారు?
  4. రైతు సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం
  5. మా ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తుంది
  6. రాష్ట్ర మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

హైదరాబాద్, సెప్టెంబర్ 19 (విజయక్రాంతి) : తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మా ణానికి రూ. 35 వేల కోట్లు, సాగులోకి 4.47 లక్షల ఆయకట్టు అంటూ మాజీ మంత్రి హరీశ్‌రావు చేస్తున్న ప్రచారంలో ఎంత మా్ర తం నిజం లేదని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ నిర్మించాలని, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు నిర్మాణం పనులను పునరుద్దరించాలని రాష్ర్ట ప్రభుత్వం నిర్ణయించిన మాట వాస్తవమేనని తెలిపారు.

అయితే హరీశ్‌రావు చెబుతున్నట్లుగా రూ. 35 వేల కోట్లతో తుమ్మిడిహట్టి బ్యారేజ్ నిర్మాణం, 4.47 లక్షల ఆయకట్టుకు సాగు నీరు అని చెబుతున్నదాంట్లో అణువంతు నిజం లేదని వెల్లడించారు. అది పూర్తిగా నిరాధారపూరితమైనదని, ఆయన మాటలు సత్య దూరమైన వని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇప్పటి వరకు బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంచనాల ప్రక్రియనే మొదలు పెట్టలేదని, అలాంటప్పుడు హరీశ్ రావు ఇవీ అంచనాలు అంటూ ఎలా నిర్దారణకు వచ్చారని సూటిగా ప్రశ్నించారు.

అన్నింటికీ అతి తెలివి తేటలు వినియోగించకూడదని, ఇలాంటి అతి తెలివి తేటలతో ప్రజా క్షేత్రంలో అభాసు పాలవుతారని హరీశ్‌రావుకు హితవు పలికారు. ఇలాంటి ప్రకటనల పట్ల తెలంగాణ సమాజం అప్రమత్తంగా ఉండాలని ప్రజల కు విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్ట్‌ల నిర్మాణాలకు సం బంధించిన అంచనాలు రూపొందించిన పక్షంలో రాష్ర్ట ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించారు.

సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోనీ రాష్ర్ట ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని పేర్కొన్నారు. రైతు సం క్షేమానికి కట్టుబడి ఉన్న రాష్ర్ట ప్రభుత్వం రైతాంగానికి సాగు నీరు, ప్రజలకు సాగు నీ రు అందించేందుకు పెండింగ్ ప్రాజెక్టుల ని ర్మాణాలు వేగవంతం చేశామని పేర్కొన్నారు.