14 August, 2026 | 3:07 PM

మొరంపల్లి బంజరలో ఘనంగా హర్‌ ఘర్‌ తిరంగా ర్యాలీ

14-08-2026 01:49 PM

బూర్గంపాడు,(విజయక్రాంతి): బూర్గంపాడు మండలం మొరంపల్లి బంజర గ్రామపంచాయతీలో హర్‌ ఘర్‌ తిరంగా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు. జడ్పీహెచ్‌ఎస్‌ పాఠశాల నుంచి బస్టాండ్‌ సెంటర్‌ వరకు విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు జాతీయ జెండాలను చేతబూని ర్యాలీ నిర్వహించారు.

దేశభక్తి, జాతీయ ఐక్యతను చాటేలా విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ర్యాలీ సందర్భంగా జాతీయ జెండాలతో గ్రామంలో సందడి నెలకొంది.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు లక్ష్మణ్‌రావు, ఉపాధ్యాయులు, ఏనుగుల వెంకట్‌రెడ్డి, ముస్కు శ్రీనివాస్‌రెడ్డి, గాదె నర్సిరెడ్డి, భూక్యా దివ్యశ్రీ, బీరకా సాయిశ్రీను, చుక్కపల్లి బాలాజీ, భూక్యా వెంకట్, ఎస్‌కే రహీమ్, బబ్బు రాయుడు, మేకల నరసింహారావు, ఇట్టే సందీప్, జువ్వాది నరేష్‌తో పాటు పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.