హక్ రైతు సేవా కేంద్రం ప్రారంభం
మల్దకల్, జూలై 7: గద్వాల నియోజకవర్గంలోని మల్దకల్ మండలం విఠలాపురం గ్రామంలో ఏర్పాటు చేసిన హక్ ఫార్మర్ సర్వీస్ (రైతు సేవా) కేంద్రాన్ని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి సోమవారం రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతులకు నాణ్యమైన వ్యవసాయ ఉత్పత్తులు, ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు అందుబాటులో ఉండేలా రైతు సేవా కేంద్రాలు పనిచేయాలని ఎమ్మెల్యే సూచించారు.
అనంతరం హక్ రైతు సేవా కేంద్రం నిర్వాహకుడు సత్యరెడ్డి ఎమ్మెల్యేకు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా రైతులకు ఎరువులను పంపిణీ చేశారు. రైతులకు అవసరమైన వ్యవసాయ ఇన్పుట్లు ఒకేచోట లభించే విధంగా రైతు సేవా కేంద్రాలు సేవలందించాలని, రైతులు నాణ్యమైన ఉత్పత్తులనే వినియోగించి అధిక దిగుబడులు సాధించాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాజారెడ్డి, మాజీ జెడ్పీటీసీ ప్రభాకర్ రెడ్డి, జిల్లా సీనియర్ నాయకుడు రమేష్ నాయుడు, మాజీ సర్పంచ్ పురుషోత్తం రెడ్డి, మాజీ ఎంపీటీసీ గోపాల్ రెడ్డి, నాయకులు సత్యరెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, మధు నాయక్, సుధాకర్ గౌడ్, బాబు రెడ్డి, తిమ్మరాజు తదితర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.






