5 June, 2026 | 5:26 PM

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు

05-06-2026 04:31 PM

-ఎంపీవో, ఎంపీడీఓ

ప్రకృతిని ప్రేమిద్దాం... 

 పర్యావరణాన్ని పరిరక్షిద్దాం -సర్పంచ్ సరిత ఠాగూర్

 ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గిద్దాం  పర్యావరణ సమతుల్యతను కాపాడుదాం- ఉపసర్పంచ్ కోడూరి నగేష్

 కొత్తగూడెం,(విజయక్రాంతి): చుంచుపల్లి మండలం,లోని రామాంజనేయకాలనీ గ్రామపంచాయతీ నందు శుక్రవారం రోజున, గ్రామ సభ నిర్వహించడం జరిగింది.చుంచుపల్లి ఎంపీవో సంధ్య పాల్గొని పంచాయతీలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ రోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేసి పచ్చని తెలంగాణ, పచ్చని భారత్ నిర్మాణానికి మన వంతు బాధ్యతగ ప్రతి ఒకరు ఒక చెట్టు నాటలని సూచించడం జరిగింది. అనంతరం సర్పంచ్, సరిత ఉపసర్పంచ్ నగేష్, అమూల్యమైన సందేశం ద్వారా గ్రామ ప్రజలను చైతన్యపరిచి ప్రకృతి మనకు దైవం ఇచ్చిన ఒక అదృష్టమని దానిని పరిరక్షించి,మన జీవపరిణామాన్ని కాపాడుకోవాలని సూచించారు.