calender_icon.png 16 February, 2026 | 9:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

హనుమంత రెడ్డికి ఘన నివాళులు

16-02-2026 08:36:14 PM

మిర్యాలగూడ,(విజయక్రాంతి): పట్టణంలోని ప్రముఖ గుత్తేదారు, మాజీ ఎంపీపీ నూకల సరళ భర్త  హనుమంతరెడ్డి దశదినకర్మలో సోమవారం మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కరరావు పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిచ్చి ఆయనతో ఉన్న అను బంధాన్ని గుర్తు చేసుకున్నారు.

ఆయన వెంట మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహారెడ్డి, నాయకులు చింత రెడ్డి శ్రీనివాసరెడ్డి, దుర్గంపూడి నారాయణరెడ్డి, నాగార్జున చారి, రంగారెడ్డి, కౌన్సిలర్ పెద్ద శ్రీనివాస్ గౌడ్, మండల పంచాయతీ కార్యదర్శుల సంఘం  అధ్యక్షులు నూకల రవీందర్ రెడ్డి, కొత్తగూడెం సర్పంచ్ పి.ప్రసాద్, సంజీవరెడ్డి,వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.