చినుర్ ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు
నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని చినుర్ గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు.అర్చకులు ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం సుప్రబాత సేవ, మహాగణపతి పూజ,పుణ్యహ వాచనం, పంచామృత అభిషేకం, సింధూర లేపనం, సహస్ర నాగవల్లి దళపూజ (తమలపాకులతో), హనుమత్ హోమం, పూర్ణాహుతి,మహా నివేదన, నీరాజన మంత్ర పుష్పం, తీర్ధ ప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు.
హనుమాన్ జయంతి సందర్భంగా ఆలయాలను ప్రత్యేకంగా పచ్చని తోరణాలతో అందంగా అలంకరించారు.ఉదయం నుంచి భక్తులు ఆలయాలకు చేరుకొని స్వామివారిని దర్శించుకుని,ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.భక్తులు చేసిన జైశ్రీరామ్, జై హనుమాన్ నామస్మరణతో ఆలయ ప్రాంగణాలు మారుమ్రోగిపోయాయి.అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి మురళి గౌడ్,వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.






