12 May, 2026 | 8:47 PM

Breaking News

హనుమాన్ సేన ఆధ్వర్యంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు   •   వృద్ధురాలి ఇళ్ళు కబ్జాకు యత్నం... న్యాయం చేయాలని వేడుకోలు   •   టి దుకాణాలలో స్మోకింగ్ జోన్లను ఎత్తివేయండి   •   గంజాయి కేసులో నలుగురిపై కేసు.. డి-అడిక్షన్ సెంటర్‌కు తరలింపు   •   మంత్రి తుమ్మల పేరున ప్రత్యేక ప్రార్థనలు జరిపిన దమ్మపేట ముస్లిం మైనారిటీ నాయకులు   •   వికె సీఎం ఫిట్ కమిటీ సమావేశం   •   సమ్మర్ క్యాంప్ ఆకస్మిక తనిఖీ   •   పదో తరగతి సప్లమెంటరీ విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ తరగతులు ప్రారంభం   •   ప్రభుత్వ స్థలాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మిస్తే సహించం   •   నిర్మాణ రంగంలో ముడి సరుకుల ధరలకు అనుగుణంగా నూతన ధరలు చెల్లించండి   •  

వేసవిలో నీటి కొరత లేకుండా చర్యలు: సర్పంచ్ రాముడు

12-05-2026 07:23 PM

మఠంపల్లి,(విజయక్రాంతి): మఠంపల్లి మండలంలోని భీల్యానాయక్ తండా గ్రామ పంచాయతీ పరిధిలో వేసవి కాలంలో గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపడుతున్నామని సర్పంచ్ బానోతు రాముడు తెలిపారు. గ్రామంలో పలు పాత బోర్లను రిపేర్ చేయించి,ఫ్రెష్ చేయించడంతో పాటు అవసరమైన ప్రాంతాల్లో కొత్త బోరింగ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

వేసవి కాలంలో ఈదురు గాలులు, విద్యుత్ అంతరాయాల కారణంగా మోటార్లు పనిచేయకపోయినా గ్రామ ప్రజలు నీటి కోసం ఇబ్బందులు పడకుండా ఈ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామ ప్రజలకు ఎప్పటికప్పుడు తాగునీటి సౌకర్యం అందించడమే తమ ప్రధాన లక్ష్యమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్,ఉపసర్పంచ్ కిషన్ నాయక్,గ్రామ నాయకులు మోతిలాల్ నాయక్, వార్డ్ మెంబర్లు బాబు నాయక్, భోజ్య నాయక్, నాగ నాయక్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు.