13 May, 2026 | 2:23 AM

భక్తి శ్రద్ధలతో హనుమాన్ జయంతి

13-05-2026 01:17 AM
  1. ఏనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో నిర్వహణ
  2. అత్యంత వైభవంగా మహా అన్నప్రసాద వితరణ

వరంగల్, మే 12(విజయక్రాంతి): వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ ప్రాంగణంలోని శ్రీలక్ష్మీ గణపతి సహిత అభయాంజనేయస్వామి దేవాలయంలో మంగళవారం హనుమాన్ జయంతి వేడుకలను అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఆలయ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఏటా నిర్వహించే మహా అన్నప్రసాద వితరణ కార్యక్రమం ఈ ఏడాది కూడా అత్యంత వైభవంగా జరిగింది.

ఉదయం 8 గంటలకు ప్రారంభమైన కార్యక్రమంలో సుమారు 10 వేల మంది భక్తులు, రైతులు, కార్మికులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. వరంగల్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అధ్యక్షుడు బొమ్మినేని రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో వ్యవసాయ మార్కెట్ సెలక్షన్ గ్రేడ్ సెక్రటరీ ఆర్ మల్లేశం,చాంబర్ మాజీ అధ్యక్షుడు   కటకం పెంటయ్య, ఛాంబర్ ప్రతినిధులు పధాన కార్యదర్శి మడూరి వేద ప్రకాష్, సంయుక్త కార్యదర్శి సాగర్ల శ్రీనివాస్, మార్కెట్ అన్నీ సెక్షన్ల అధ్యక్ష, కార్యదర్శులు, ఇతర ప్రజా ప్రతినిదులు పాల్గొన్నారు.

ఆలయ కమిటీ సభ్యులు గజ్జెల రామకృష్ణ, ఉప్పాల శ్రీనివాస్, పెద్ది శ్రీధర్, కసిరెడ్డి గురుపాల్ రెడ్డి, బబ్బుల రవికుమార్ లు కీలక పాత్ర పోషించారు. ఈ వేడుకలో మార్కెట్ వ్యాపారస్తులు, రైతులు, మార్కెట్ కమిటీ సిబ్బంది, గుమస్తాలు, దడవాయిలు, హమాలి కార్మికులు,మార్కెట్ చుట్టుపక్కల కాలనీలలోని ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని భక్తితత్పరతను చాటు కున్నారు.ఇంతటి భారీ కార్యక్రమాన్ని క్రమ శిక్షణతో విజయవంతం చేసినందుకు చాం బర్ ఆఫ్ కామర్స్, ఆలయ కమిటీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాయి.