22 August, 2026 | 2:18 PM

లండన్‌లో సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన లివర్‌పూల్ ప్రతినిధులు

22-08-2026 01:48 PM

తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి ఆసక్తి

లండన్‌: లివర్‌పూల్ సిటీ డెవలప్‌మెంట్‌కు(Liverpool Delegation) చెందిన సుసాన్ ఫిన్నెగన్, నువాలా గల్లాఘర్‌తో పాటు లివర్‌పూల్ ఫుట్‌బాల్ క్లబ్ ప్రతినిధులు లండన్‌లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని(CM Revanth Reddy) కలిశారు. లైఫ్ సైన్సెస్, టెక్నాలజీ, క్రీడలు, క్రియేటివ్ ఎకానమీ రంగాల్లో తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యానికి లివర్‌పూల్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఈ భాగస్వామ్యాన్ని అధికారికంగా ఖరారు చేసేందుకు లివర్‌పూల్ ప్రతినిధుల బృందం అక్టోబర్‌లో హైదరాబాద్‌కు రానుంది.