వడగండ్ల వాన
- హైదరాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీవర్షం
- నేలకూలిన వృక్షాలు, విద్యుత్ స్తంభాలు
ధ్వంసమైన పలు బైక్‌లు.. రాకపోకలకు అంతరాయం
పలుచోట్ల తృటిలో తప్పిన ప్రమాదాలు
ఒక్కసారిగా చల్లబడిన వాతావరణం
ఈ నెల ౨౨ వరకు రాష్ట్రంలో వర్షాలు :వాతావరణ శాఖ
సికింద్రాబాద్/కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): హైదరాబాద్‌లో ఆదివారం ఉదయం నుంచి ఎండలు దంచికొట్టినా.. మధ్యాహ్నం నుంచి పలు ప్రాంతాల్లో అకస్మాత్తుగా వాతావరణం చల్లబడి, వడగండ్ల వాన కురిసింది. అలాగే కామారెడ్డి జిల్లాలో కూడా వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వృక్షాలు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. ద్విచక్రవా హనాలు ధ్వంసమయ్యాయి. పలు చోట్ల ప్రమాదాలు తృటిలో తప్పాయి. రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగరంలో అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వాన పడింది.
ఎల్బీనగర్, మీర్‌పేట్, కర్మన్‌ఘాట్, మూసాపేట, బాలానగర్, కూకట్ పల్లి తదితర ప్రాంతాల్లో వడగండ్ల వాన పడింది. ఎల్బీనగర్, మీర్‌పేట్, కర్మన్‌ఘాట్, సికింద్రాబాద్, కంటోన్మెంట్ బోయిన్‌పల్లి, తిరమలగిరి, అల్వాల్‌లో, కుత్బుల్లాపూర్, జీడిమెట్ల, సుచిత్ర, కొంపల్లి, గండిమైసమ్మ, దుండిగల్, మల్లంపేట్, బహుదూర్ పల్లి, సూరారం, చింతల్, షాపూర్‌నగర్, గాజులరామారం, ఎల్లమ్మ బండ, హైదర్‌నగర్, వివేకానందనగర్, నిజాంపేట, ప్రగతినగర్, కేబీహెచ్‌బీకాలనీ, మూసాపేట, బాలానగర్, ఫతేనగర్, కూకట్‌పల్లి మూసాపేట పరిసర ప్రాంతాలలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది.
చింతల్, పద్మనగర్‌లో గాలి వాన ధాటికి వేర్లతో సహా భారీవృక్షం కూలింది. చెట్టు ధాటికి రెండు కరెంట్ స్తంభాలు నేలకొరిగాయి. పలు ద్విచక్రవాహనాలు ధ్వంసం అయ్యాయి. అయితే గత కొన్ని రోజులుగా ఎండలు విపరీతంగా కొట్టండంతో ఆదివారం కురిసిన వర్షానికి నగరంలో ఒక్కసా రిగా వాతావరణం చల్లబడింది. ఇక కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఆదివారం మధ్యా హ్నం వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.
ఈదురు గాలులతో బలమైన వర్షంతో పాటు వడగండ్లు పడడంతో పట్ట ణ ప్రజలు ఆందోళనకు గురయ్యారు. బ స్టాండ్ వద్ద వేపచెట్టు కూలి రోడ్డుకు అడ్డంగా పడిపోయింది. ఆ సమయంలో ప్రయాణికు లు లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది.
ఈదురుగాలులకు పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో సరఫరా నిలిచిపోయింది. వెంటనే విద్యుత్ శాఖ అధికారులు ఆ స్తంభాలను తొలగించి విద్యుత్‌ను పునరుద్ధరించారు. వారం రోజులుగా 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత తో ఎండలు కొట్టడంతో ఆందోళన చెందిన పట్టణ ప్రజలకు అకాల వర్షం కాస్త ఉపశమనం కలిగించింది. కామారెడ్డితో పాటు చుట్టుపక్కల గ్రామాల్లో సైతం ఈదురుగాలతో కూడిన వడగండ్ల వర్షం కురిసింది.
మూడు రోజులపాటు తేలికపాటి వర్షాలు
రానున్న మూడు రోజులపాటు హైదరాబాద్ మహానగరంతోపాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఏప్రిల్ 19 నుంచి 22వ తేదీ వరకు తెలంగాణలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురవనున్నట్లు పేర్కొంది. అలాగే మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని చెప్పింది.
నాలుగు జిల్లాలకు ఎల్లో, ఆరు జిల్లాలకు ఆ రంజ్ అలర్ట్ వాతావరణ శాఖ జారీ చేసింది. ఆదిలాబాద్, కామారెడ్డి, నాగర్‌కర్నూల్, నిర్మ ల్, వికారాబాద్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో హెచ్చరికలు, మె దక్, మేడ్చల్ మల్కాజ్గిరి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది.
వడదెబ్బతో రైతు మృతి
- కామారెడ్డి జిల్లా పాల్వంచలో ఘటన
- రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి
కామారెడ్డి, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): భానుడి ప్రతాపానికి మరో రైతు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా పాల్వంచ మండల కేంద్రం పాల్వంచ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. పాల్వంచ గ్రామానికి చెందిన రైతు చాకలి మల్లయ్య (48) వడ్లను గత మూడు రోజులుగా ఎండలో ఆరబోశాడు. ఆదివారం ఉద యం వడ్లు నేర్పుతూ కుప్పకూలి మృతి చెందాడు.
వడ్లను ఆరబెడుతూ ఎండ తీవ్రతకు తట్టుకోలేకే మల్లయ్య మృతి చెందాడని గ్రామస్తులు తెలిపారు. మల్ల య్య కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సహాయం అందజేయాలని గ్రామ సర్పంచ్ కూచని శేఖర్ కోరారు. గత రెండు రోజుల క్రితం కూడా కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట మండలానికి చెందిన రైతు వడదెబ్బకు గురై మృతి చెందాడు.






