15 April, 2026 | 3:56 AM

జై భీమ్

15-04-2026 01:19 AM

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి : అంబేద్కర్ ప్రపంచ మేధావి. ఈ దేశానికి రెండు కళ్లలో ఒకటి మహాత్మాగాంధీ అయితే మరో కన్ను అంబేద్కర్. ఆయన ఆలోచన విధానమే ప్రజాపాలన విధానం. అంబేద్కర్ రాజ్యాం గంలో పెట్టిన ఆర్టికల్ 3నే తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రధాన కారణం.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క : అంబేద్కర్ భారత్‌లో పుట్టడం మన అదృ ష్టం. ఆయన ఒక అద్భుతమైన ప్రతిభాశాలి. రాజ్యాంగం ద్వారా ప్రజాస్వామ్య పునాదులను ఏర్పరిచి, ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా భారత్‌ను నిలబెట్టిన గొప్ప దార్శనికుడు.

బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ : కాంగ్రెస్ ఎప్పుడూ అంబేద్కర్‌ను రాజకీయ అవసరాల కోసం వాడుకుందే తప్ప గౌరవించలేదు. 1952, 1954లో ఆయన పార్లమెంటుకు రాకుండా కుట్రలు చేసి కాంగ్రెస్ ఓడించింది. నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ కాలంలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదు.

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు : అంబేద్కర్‌ను అవమానించింది కాంగ్రెస్, నెహ్రూనే. స్వాతంత్య్రానికి ముందు బాంబే ప్రెసిడెన్సీలో అంబేద్కర్‌ను పోటీ చేయకుండా అడ్డుకోవడం, ఆయనకు వ్యతిరేకంగా అభ్యర్థులను నిలబెట్టి ఓడించింది. చివరికి ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆయన అసెంబ్లీలోకి ప్రవేశించాల్సి వచ్చింది.