జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా వ్యాయామ ఉపాధ్యాయుడికి ఘన సన్మానం
29-08-2026 04:56 PM
ఆలేరు,(విజయక్రాంతి): ఆలేరు మండలం షరాజీపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాయామ ఉపాధ్యాయుడు మధును ఉపాధ్యాయులు, విద్యార్థులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ, విద్యార్థులు హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని క్రీడల్లో రాణించాలని సూచించారు. క్రీడల్లో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే కష్టపడి, నిరంతరం సాధన చేయాలని తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు.






