calender_icon.png 5 February, 2026 | 10:57 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రచారంలో దూసుకెళ్తున్న జీవీఆర్

05-02-2026 12:47:53 PM

బ్రహ్మరథం పడుతున్న ఓటర్ 

పాల్వంచ, (విజయక్రాంతి): ఈ నెల 11 వ తేదీన జరగనున్న కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో పాల్వంచ డివిజన్ పరిధిలోని 47 వ డివిజన్ అభ్యర్థి గుర్రం వెంకటేశ్వర్లు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. టిడిపి బలపరిచిన సిపిఐ అభ్యర్థిగా ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ స్థానిక సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటర్ మహాశయులు కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి ఆశీర్వదించేందుకు సుముఖత చూపుతున్నారు. విద్యావంతుడు, యువకుడు కావడం వల్ల జి వి ఆర్ కు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. 47 వ డివిజన్ అభ్యర్థిగా గెలుపు తద్యం అన్నట్టుగా ఆయన ప్రచారం సాగుతోంది.