28 March, 2026 | 4:30 PM

Breaking News

సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •   ప్రభుత్వం ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి   •   'తొలి ముద్ద'.. బ్రేక్ ఫాస్ట్ స్కీం ప్రారంభం.. ఆరేళ్లలోపు పిల్లలకు పౌష్టికాహారం   •   కిషన్ రావుపేటలో వైభవంగా పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన   •   కూసుమంచి తహాశీల్దారుగా సైదులు బాధ్యతలు స్వీకరణ   •   ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి   •  

ఏఎంసీ చైర్ పర్సన్ పదవికి రాజీనామా చేసిన గుండాటి గోపిక జితేందర్ రెడ్డి

26-03-2026 01:12 AM

జీవన్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్లు ‘విజయక్రాంతి‘తో వెల్లడి

ధర్మపురి, మార్చి25(విజయక్రాంతి): మాజీ మంత్రి జీవన్ రెడ్డి రాజీనామా సెగలు వెల్గటూర్ మండలాన్ని సైతం తాకా యి. కార్యకర్తల నుండి మొదలుకొని పదవిలో ఉన్నవారు సైతం కాంగ్రెస్ పార్టీకి రాజీనామా బా టలో పయనిస్తున్నారు. జగిత్యా ల జిల్లాలో బుధవారం మాజీ మంత్రి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పా ర్టీకి రాజీనామా చేయగానే వెంటనే వెల్గటూర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి లు తమ చైర్ పర్సన్ పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు.

తమకు కాంగ్రెస్ పార్టీ అంటే ఎనలేని అభిమానం ఉన్నప్పటికీ, తమకు రాజకీయ గురువు అయినటువంటి జీవన్ రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీలో తాము సైతం ఉండలేమంటూ భావోద్వేగానికి లోనయ్యారు.ఇన్నేళ్లు తమకు సహకరించిన కార్యకర్తలకు,పార్టీ విధేయులకు కృతజ్ఞతలు తెలిపారు. ఇకనుండి కష్టమైన,నష్టమైన జీవన్ రెడ్డి బాటలోనే తాము నడవనున్నట్లు ఏఎంసి చైర్ పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి ఈ సందర్భంగా ‘విజయక్రాంతి‘తో వెల్లడించారు.