బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు
హైదరాబాద్: సికింద్రాబాద్ పరిధి న్యూ బోయిన్‌పల్లి సెంటర్లోని(Bowenpally) ఒక ఆప్టికల్ దుకాణంలో శనివారం మధ్యాహ్నం భారీ అగ్నిప్రమాదం (Fire Accident) సంభవించింది. ఈ ప్రమాదం దుకాణదారులలో తీవ్ర భయాందోళన కలిగించింది. అదృష్టవశాత్తు, ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనకు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణమై ఉండవచ్చని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు.
ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో నిండిపోవడంతో భయాందోళనకు గురైన దుకాణదారులు ముందు జాగ్రత్త చర్యగా తమ దుకాణాలను మూసివేసి సురక్షిత ప్రాంతాలకు పరుగులు పెట్టారు. స్థానికుల సమాచారంతో రెండు అగ్నిమాపక వాహనాలతో ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది గంటసేపు శ్రమించి మంటలు ఆర్పి వేశారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.




