28 March, 2026 | 5:39 PM

Breaking News

వికలాంగులకు 6 వేల పెన్షన్ హామీ ఏమైంది....?   •   మైనర్లతో కౌన్సిలర్ కొడుకు అసభ్యకర వీడియోలు..100 మందికి పైనే బాధితులు   •   దేవాదాయ శాఖను అభినందించిన మంత్రి తుమ్మల   •   మామునూరు టూరిజం అభివృద్ధి పనులను పరిశీలించిన బండారు నరసింహారావు   •   ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కవిత   •   సిరిసిల్లలో ఉపాధి హామీ పనులు తక్కువ   •   టీఎంసీపై బీజేపీ 'ఛార్జిషీట్'.. దేశ భద్రతకు బెంగాల్ ఎన్నికలు కీలకమన్న అమిత్ షా   •   బోయిన్‌పల్లిలో అగ్నిప్రమాదం — కళ్లద్దాల దుకాణంలో ఎగిసిపడ్డ మంటలు   •   వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్   •   ట్రైబల్ మోడల్ స్పోర్ట్స్ స్కూల్ ప్రవేశానికి ఎంపికలు   •  

ఘనంగా రావి వీరవేన్లయ్య 34 వర్ధంతి

28-03-2026 03:48 PM

దమ్మపేట,(విజయక్రాంతి): శనివారం మండల పరిధిలోని  ముష్టిబండ  గ్రామంలో సిపిఎం పార్టీ నాయకులు అమరజీవి కామ్రేడ్ రావి వీర వెంకయ్య 34 వ వర్ధంతి పార్టీ మండల కమిటీ సభ్యులు,  ముష్టిబండ శాఖ కార్యదర్శి కొలిక్కి పోగు శ్రీనివాస్ రావు అధ్యక్షతన జరిగింది. మొదటగా పార్టీ జెండాను వీర వెంకయ్య స్మారక స్థూపం వద్ద సిపిఎం పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెర పార్టీ పుల్లయ్య ఎగురవేశారు. వెంకయ్య చిత్రపటానికి పూలమాలను మాజీ జిల్లా కమిటీ సభ్యులు దొడ్డా లక్ష్మీనారాయణ వేసి ఘనంగా నివాళులర్పించారు. తరువాత జరిగిన వర్ధంతి సభలో ముఖ్య అతిథిగా జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెర పార్టీ పుల్లయ్య మాట్లాడుతూ... రావి వీరవెంకయ్య తాను జీవితాంతం మార్క్సిస్టు పార్టీ జెండాను భుజాన వేసుకొని పని చేశారన్నారు.

ప్రపంచంలోనే గొప్పదైన మార్క్సిస్ట్ సిద్ధాంతాన్ని నమ్మి పేద ప్రజల కోసం, కార్మికుల కోసం, వ్యవసాయ కార్మికులు, రైతుల తరఫున వారి వారి సమస్యలపై మిలిటెంట్ పోరాటాలు నిర్వహించారని, ఆనాటి జమీందారులు, జాగీర్దారులు, ముఖాసాదారులు, పెత్తందారులు ప్రజలపై చేస్తున్న దాడులను ప్రతిఘటించారని, ప్రజలతో మమేకమై ప్రజల్లో ఉండి పనిచేశారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆనాటి సత్తుపల్లి నియోజకవర్గంలో ప్రధానంగా జిల్లా నాయకులుగా పార్టీలో పని చేశారని, తను పుట్టినటువంటి ముష్టిబండ గ్రామంలో సిపిఎం పార్టీ అభివృద్ధి కోసం ఎనలేని కృషి చేశారు.

గొప్ప మహానుభావుడని, ఆదర్శనీయుడని, నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసిన మహానేత అని రావి వీర వెంకయ్యకు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో దమ్మపేట మండల కార్యదర్శి మొరంపూడి శ్రీనివాసరావు, ముష్టిబండ గ్రామ శాఖ సభ్యులు అనిల్ కుమార్, హెచ్ మల్లేశ్వరరావు, రావి వీర వెంకట కుమార్, జగన్నాధపు శ్రీనివాసరావు, చీకటి వెంకట లక్ష్మీనారాయణ, గ్రామ పెద్దలు కూకలకుంట సత్యనారాయణ, కూకలకుంట చిట్యారావు, కుక్కలకుంట భద్రయ్య, రవి, జోనెబోయిన శ్రీనివాసరావు, బసవ శ్రీనివాసరావు, జగపతి, లక్ష్మీనారాయణ, ఉడుతనేని రవి, తదితరులు పాల్గొన్నారు.