వేలంలో భారీ ధర పలికిన గాంధారి తై బజార్
28-03-2026 04:05 PM
గాంధారి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండల కేంద్రంలోని తై బజార్ వేలంలో భారీ ధర పలికింది. శనివారం నాడు ఉదయం గాంధారి గ్రామపంచాయతీ కార్యాలయంలో గ్రామ సర్పంచ్ మమ్మాయి రేణుకా యాదవ్ అధ్యక్షతన 2026-27 సంవత్సరానికి గాను తై బజార్, దాఖల చిట్టి వేలం నిర్వహించారు.
ముందుగా తై బజార్ వేలంలో నలుగురు పాల్గొనగా మండల కేంద్రానికి చెందిన గడ మురళి రూ.9.10 లక్షలకు పాట పాడి వేలంలో తై బజార్ దక్కించుకున్నాడని పంచాయతీ కార్యదర్శి నాగరాజు తెలిపారు. అనంతరం దాఖలా చిట్టి వేలంలో అయిదుగురు పాల్గొనగా చివరికి రూ.4.32 లక్షలకు వాడే శ్రీధర్ దక్కించుకున్నట్టు ఆయన తెలిపారు.




