10 May, 2026 | 2:45 PM

Breaking News

సీఎం విజయ్‌కి అభినందనలు తెలిసిన ప్రధాని మోదీ   •   మల్లెల మడుగులో ప్రగతి పరుగు..   •   లేబర్ కోడ్లు రద్దు చెయ్యాలని కోరుతూ గెజిట్ ప్రతులు దగ్దం   •   అధికారుల అలసత్వం వల్ల అకాల వర్షాలకు నష్ట పోయిన రైతులు – సీపీఎం జిల్లా నాయకులు పిట్టల అర్జున్   •   వనదుర్గమ్మ ఆదాయానికి అధికారుల గండి   •   మొక్కజొన్న కొనుగోలు కేంద్రం సద్వినియోగం చేసుకోవాలి   •   కియా సైరోస్ ప్రారంభించిన హనుమకొండ డీసీసీ అధ్యక్షులు ఇనగాల వెంకట్రామ్ రెడ్డి   •   కందనూల్ క్విడ్ ప్రోకో వ్యవహారంలో పరస్పర దాడులు.!   •   అంతిమ యాత్రలో పాడే మోసి అభిమానాన్ని చాటుకున్న టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు   •   మోడీ సభకు ప్రత్యేక రైలులో బిజెపి శ్రేణులు   •  

రైతులకు పెరుగుతున్న సవాళ్లు

22-11-2025 12:00 AM

పత్తి పంట భారత వ్యవసాయంలో కీలకపాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవలి కాలంలో పింక్‌బాల్ వార్మ్ దాడులు పత్తి రైతులను తీవ్ర సవాళ్లను ఎదుర్కొనే స్థితికి నెట్టేస్తున్నాయి. పత్తి కాయల లోపలికి చేరి గింజలు, నూలు రెండింటినీ పాడుచేసే ఈ పురుగు వల్ల కాయలు బయటకు ఆరోగ్యంగా కనిపించినా లోపల మాత్రం పూర్తిగా నాశనమవుతుంటా యి. ఫలితంగా కోతల సమయంలో రైతులకు దీని అసలు నష్టం తెలుస్తోంది.

ఈ దాడుల కారణంగా పత్తి దిగుబడులు గణనీయంగా తగ్గిపోవ డం, నాణ్యత తగ్గడం వంటి సమస్యలు ఉత్పత్తి వ్యయాలను తిరిగి పొందే అవకాశాన్ని తగ్గిస్తున్నాయి. విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు, కూలీలకు భారీగా ఖర్చు పెట్టిన రైతులు చివరికి నష్టాలతో ఇబ్బంది పడాల్సి వస్తుంది. దీనికి తోడు అధిక రుణభారం, మార్కెట్ అనిశ్చితి కారణంగా ఆర్థిక ఇబ్బందులు పెరిగిపోతున్నాయి.

 శ్రీనివాస్, జనగాం