25 February, 2026 | 2:45 PM

ప్రహరి గోడ నిర్మాణానికి భూమి పూజ

25-02-2026 12:29 PM

కుమ్రం భీం అసిఫాబాద్(విజయక్రాంతి): జిల్లా కేంద్రంలోని ఉత్తర వాహిని నది తీరాన గల శ్రీ శివభక్త మార్కండేయ ఆలయ ప్రహరీ గోడ నిర్మాణానికి బుధవారం భూమి పూజ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పనులను ప్రారంభించారు. ఆలయ అభివృద్ధి పనుల్లో భాగంగా ప్రహరీ నిర్మించడం జరుగుతుందని నిర్మాణ కమిటీ సభ్యులు తెలిపారు. ఆలయ నిర్మాణానికి పద్మశాలి కుల బంధువులు మరింత సహాయ సహకారాలు అందించాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు ఇరుకుల్లా ఆంజనేయులు, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అనుమాండ్ల శ్రీకాంత్, అల్లె శ్రీకాంత్, నాయకులు లింగయ్య ,ధర్మయ్య, తిరుపతి, ప్రకాష్, శ్రీనివాస్, సత్యనారాయణ ,మధుకర్, సురేష్ ,ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.