25 February, 2026 | 2:44 PM

ప్రశాంతంగా ఇంటర్ పరీక్ష

25-02-2026 12:27 PM

మునిపల్లి,(విజయక్రాంతి): ఇంటర్మీడియట్ మొదటి(Telangana Inter Exams) సంవత్సరం బుధవారం జరిగిన మొదటిరోజు పరీక్ష ప్రశాంతంగా జరిగింది. ఇందులో బాగానే  మండల పరిధిలోని బుదేరా చౌరస్తాలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఇంటర్మీడియట్  పరీక్షకు మొత్తం మండల వ్యాప్తంగా 321 మంది విద్యార్థులు పరీక్ష రాయవలసి ఉండగా ఇందులో ఇద్దరు విద్యార్థులు గైర్హాజరు కావడంతో 319 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష కేంద్రాన్ని తహసిల్దార్ రంగారావు, కళాశాల చీఫ్ సూపర్డెంట్ రమేష్, ఆర్ ఐ సుభాష్, పోలీస్ సిబ్బంది సందర్శించి పరీక్ష  ఎలా జరుగుతుందని  పరిశీలించారు. కాగా పరీక్షా కేంద్రానికి ఓ విద్యార్థి ఐదు నిమిషాలు ఆలస్యంగా రావడంతో అధికారుల సూచన మేరకు విద్యార్థికి పరీక్ష రాసినందుకు అనుమతిచ్చారు.