8 July, 2026 | 7:59 PM

Breaking News

ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడమే లక్ష్యం   •   కాంగ్రెస్ పార్టీ జిల్లా ఎస్సీ విభాగం పాల్వంచ టౌన్ అధ్యక్షుడిగా గోలి సదాశివ   •   అగ్నివీర్ ఇండియన్ నేవిలో ఉద్యోగం సాధించిన వ్యక్తికి సన్మానం   •   తెలంగాణ చౌక్ లో ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు   •   తుంగతుర్తి లైన్స్ క్లబ్ చేస్తున్న సేవలు మరువలేనివి   •   కరీంనగర్ డీసీసీ కార్యాలయంలో ఘనంగా వైఎస్ఆర్ జయంతి వేడుకలు   •   ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభం   •   ప్రియదర్శిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో ఐబీఎం స్కిల్స్‌బిల్డ్–టాస్క్ శిక్షణ ముగింపు   •   బాన్సువాడలోని ఆదిత్య స్కూల్ పై మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు   •   బిఆర్ఎస్ కు షాక్ .....   •  

ఆర్టీసీ సమ్మెకు బీజేపీ మద్దతు

23-04-2026 11:50 AM

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి యాదగిరి సునీల్ రావు 

ముకరంపుర,(విజయక్రాంతి): బుధవారం నుండి ఆర్టిసి  కార్మికులు చేస్తున్న సమ్మె కు పార్టీ తరఫున పూర్తి మద్దతు ఇస్తున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, కరీంనగర్ డిప్యూటీ  మేయర్ యాదగిరి సునీల్ రావు ప్రకటించారు. గురువారం సమ్మె చేస్తున్న శిబిరానికి వెళ్లి ఆర్టీసీ కార్మికులను కలిసి వారి న్యాయపరమైన కోరికలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. శాంతియుతంగా సమ్మె చేస్తున్న చోట టెంట్ కూడా వేసుకోవడానికి అనుమతి నిరాకరించడం ఆర్టీసీ యాజమాన్య  నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. మీ సమస్యలు పరిష్కారం అయ్యేంతవరకు మీ వెంట మా పార్టీ ఉంటుందని హామీ ఇచ్చారు. అలాగే ఆర్టీసీ కార్మికులు వారి సమస్యలు విన్నవించుకున్నారు. కల్యాణ లక్ష్మి పథకం అమలు చేస్తున్న అప్పటినుండి ఇప్పటివరకు మేము మా ఇళ్ళలో మా అన్నదమ్ములకు రాఖీలు కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడిందని వారి గోడు వెల్లబోసుకున్నారు.