23 April, 2026 | 12:47 PM

అద్భుతమైన అభివృద్ధి చేసుకుందాం

23-04-2026 11:32 AM

ఎమ్మెల్యే యెన్నం ఎమ్మెల్యేగా ఉండడం మన అదృష్టం 

డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి 

మహబూబ్ నగర్, (విజయక్రాంతి) : నగరం అద్భుతంగా అభివృద్ధి చేస్తున్న అడుగులు వేస్తున్నామని డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి అన్నారు. గురువారం నగరం లోని 31వ డివిజన్ లో వార్డు సభ లో మహిళలకు చీరలను అందించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడారు. మాయమాటలు చెప్పి కాలం గడిపే విధానం తమది కాదని నిక్కచ్చిగా చేసేది.. చేయబోయేది మాత్రమే చెప్పడం జరుగుతుందన్నారు. మీ అందరి సహకారంతో భగవంతుడు ఇచ్చిన ఈ అవకాశాన్ని వందకు వందశాతం సద్వినియోగం చేసుకునేలా అడుగులు వేస్తున్నామని తెలిపారు. అభివృద్ధిలో ఎక్కడ రాజీ పడకుండా ప్రజల అవసర లలో ప్రార్ధన్యత క్రమంలో ప్రతిదీ పరిష్కరించుకుంటూ ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు.

ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా ప్రజలందరికీ నచ్చే నాయకులుగా పనిచేస్తున్నామని ప్రజాపాలన ప్రభుత్వానికి మనందరం అండగా ఉండవలసిన అవసరం ఉందన్నారు. నిర్లక్ష్యమనే మాటకు తావు లేకుండా అభివృద్ధి కోసం కంకణ బద్ధులమై పని చేస్తున్నామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి గొప్ప ఆలోచనలతో అడుగులు వేస్తున్నారని, వారి అడుగుజాడల్లో నగరాన్ని మరింత అభివృద్ధి చేస్తామని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ రాజన్న, ఆర్పి వరలక్ష్మీ, వార్డ్ ఆఫీసర్ బాలకృష్ణ, మైత్రి యాదయ్య, శ్రావణ్ కుమార్ చిన్నా యాదవ్, రాకేష్ యాదవ్, రమేష్, చందు, అక్బర్, అభ్రర్,రామలక్మీ,వార్డ్ ప్రతినిధులు,  మహిళా సంఘాలు,వివిధ పార్టీల నాయకులు, సంఘ నాయకులు, వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.