27 May, 2026 | 2:25 AM

3న కోహెడలో పండ్ల మార్కెట్‌కు శంకుస్థాపన

27-05-2026 12:20 AM
  1. హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి తుమ్మల తదితరులు
  2. పనులు పరిశీలించిన ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, అధికారులు

హైదరాబాద్, మే 26 (విజయక్రాంతి): కోహెడలో చేపట్టే నూతన మార్కెట్ కార్యక్రమం పనులను మంగళవారం ఎమ్మెల్యే ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీ నారాయణ రెడ్డి, మల్కాజిగిరి సీపీ సుమతి, గడ్డి అన్నారం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు, పాలకవర్గం సభ్యులు పరిశీలించారు. జూన్ 3 న కోహెడ ప్రాంతంలో పండ్ల మార్కెట్‌కి శంకుస్థాపన కార్యక్రమం, వేలాది మంది రైతులతో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.

ఈ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా అధికారులు, పాలకవర్గం కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరం చేస్తున్నారు. బాధిత రైతులకు తప్పకుండా న్యా యం చేసామని, అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో మార్కెట్ నిర్మాణం చేపడతామని ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. 

కాగా ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న పండ్ల మార్కెట్ నిర్మాణానికి రేవంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వం ముందడుగు వేసింది.. ఇక పండ్ల రైతులకు, వ్యాపారులకు కష్టాలు తీరినట్లే.. కోహెడ ప్రాంతంలో సర్వే నంబర్ 167/1 లో దాదాపు 179 ఎకరాలలో చేపట్టనున్న నూతన పండ్ల మార్కెట్‌కి జూన్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు శంకుస్థాపన చేయనున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మం త్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు.

కాగా మార్కెట్ పనులను పరిశీలించిన వారి లో ఆర్డీవో అనంత రెడ్డి, డీసీపీ అనురాధ, ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాసులు, ఇంటెలిజెన్స్ డీసీపీ నరసింహ రెడ్డి, ఏసీపీ కాశిరెడ్డి, సీఐ అశోక్ రెడ్డి, ఎమ్మార్వో సుదర్శన్ రెడ్డి, మార్కెటింగ్ ఎస్‌ఈ లక్ష్మణ్, డీఈ రవీంధర్, డీడీ ప్రసాద్ రావు, జేడీ మల్లేశం, మార్కెట్ సెక్రటరీ ఎల్.శ్రీనివాస్ తో పాటు మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సీహెచ్ భాస్కర చారి, సభ్యులు జైపాల్ రెడ్డి, మధుసూదన్ రావు, అంజయ్య, రఘుపతి రెడ్డి, మచ్చెందర్ రెడ్డి,నవరాజ్ ఇబ్రహీం పాల్గొన్నారు.