29 April, 2026 | 5:45 PM

ప్రతి కాలనీని అభివృద్ధి చేయడమే ప్రధాన లక్ష్యం

29-04-2026 03:58 PM

వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

హనుమకొండ టౌన్,(విజయక్రాంతి): వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగంగా కొనసాగుతున్నాయని, సమస్యత్మక ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. బుధవారం 31వ, 51వ డివిజన్ లలో 1.60 కోట్ల రూపాయల వ్యయంతో సిసి రోడ్లు, డ్రైనేజీలు, కల్వర్టు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.

అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఎన్నికలకు ముందు పాదయాత్రలో గుర్తించిన సమస్యలను ప్రధాన్యత క్రమంలో తీసుకొని, ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దశలవారీగా పరిష్కరిస్తున్నామని తెలిపారు.నియోజకవర్గంలోని ప్రతి కాలనీలో స్థానికుల నుండి వచ్చిన వినతులను, ఆధారం చేసుకుని అభివృద్ధి పనులను అమలు చేస్తున్నామని అన్నారు. ప్రారంభించిన ప్రతి పనిని నిర్ణయిత కడుపులో పూర్తి చేయడానికి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళుతున్నామని, పనుల నాణ్యత పై రాజీ ఉండదని తెలిపారు.