భోజనశాల, వంటశాలకు భూమి పూజ
తాడ్వాయి, ఆగష్టు 26 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని శబరిమాత ఆశ్రమం ఆవరణలో బుధవారం ఆశ్రమ కమిటీ నిర్వాహకులు, గ్రామ పెద్దలు వంటశాల, భోజనశాలల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ... వంటశాల, భోజనశాలల నిర్మాణానికి రూ.5 కోట్ల వరకు ఖర్చు అవుతుందని వారు తెలిపారు.
శ్రీ శబరిమాత అమ్మవారి భక్తులు ప్రతిరోజు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి అమ్మ భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని తెలిపారు. చిన్న భక్తులకు ప్రతిరోజు అన్నదానం నిర్వహిస్తామని వివరించారు. సరైన వంటశాల,బోజనశాలలు లేకపోవడంతో భక్తులకు ఇబ్బందులు ఏర్పడుతు న్నాయని తెలిపారు. అందుకోసమే శ్రీ శబరిమాత ఆశ్రమం ఆవరణలో వంటశాల, భోజనశాలల కు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్లు వారు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,ఆశ్రమ కమిటీ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు.






