26 August, 2026 | 7:57 PM

వన దుర్గ మాత గుడి కమాన్ నిర్మాణానికి భూమి పూజ

26-08-2026 06:51 PM

బిబిపేట,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా  బీబీపేట్ మండల కేంద్రంలోని  వనదుర్గ పెద్దమ్మ తల్లి గుడి వద్ద కమాన్ నిర్మాణం కోసం భూమి పూజ చేపట్టారు. శివార్ రామ్ రెడ్డి పల్లి సర్పంచ్ ధరణి లక్ష్మి శ్రీనివాస్, బీబీపేట్ సర్పంచ్ ఉప్పల సాత్విక సాయినాథ్ లు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచ్ లు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపిటిసి  లు భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు.