తాండూరులో ఘనంగా రంజాన్ వేడుకలు।
21-03-2026 01:59 PM
పండగ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే.
తాండూరు, మార్చి 21, (విజయ క్రాంతి): వికారాబాద్ జిల్లా తాండూర్ నియోజకవర్గంలో రంజాన్ వేడుకలు శనివారం ఘనంగా జరిగాయి. తాండూరు పట్టణం లో రంజాన్ పండగ సందర్బంగా ఖాంజపూర్ గుట్ట సమీపంలో గల ఈద్గాలో రంజాన్ ప్రత్యేక ప్రార్థన లో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముస్లిం లతో కలిసి పాల్గొని ప్రార్థన చేశారు. అనంతరం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ,ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ముస్లీంలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు .




