27 July, 2026 | 12:30 PM

Breaking News

100 స్తంభాల ఆలయ రక్షణకు తక్షణ చర్యలు తీసుకోవాలి   •   గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై ఆర్డీవోకు ఫిర్యాదు   •   ప్రేమ పేరుతో మోసం.. పెళ్లి చేసుకుంటానని సహజీవనం   •   డ్రగ్స్ మత్తులో పోలీసులపైకి కారు ఎక్కించిన యువకుడు   •   లిఫ్ట్ మోటార్ల తో నీటిని రిజర్వాయర్ లోకి ఎత్తాలి: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్   •   సులానగర్ పీహెచ్‌సీని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   సిరిసిల్ల జిల్లా గౌడ యువజన సంఘం అధ్యక్షుడిగా సందీప్ గౌడ్.   •   జలపాతాల అందాలను పర్యాటకులు ఆస్వాదించేలా ఏర్పాటు చేయండి   •   బావుసాయిపేట ఇసుక క్వారీ వద్ద రైతుల ఆందోళన   •   దూడను తిన్న చిరుత పులి   •  

ఘనంగా ఇందిరమ్మ ఇండ్ల ప్రారంభోత్సవాలు

04-06-2026 12:30 AM

తూప్రాన్, జూన్ ౩:   రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కొనసాగిస్తున్న ఇందిరమ్మ ఇండ్ల కార్యక్రమంలో భాగంగా యావపూర్ గ్రామంలో మూడు ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పూర్తి చేసుకున్న సందర్భంగా గృహ ప్రవేశాలకు గ్రామ సర్పంచ్ యాంజల స్వామి ఆధ్వర్యంలో బుధవారం శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఇందిరమ్మ గృహాల నిర్మాణం నిర్విరామంగా కొనసాగుతుందని ఖాళీ స్థలం ఉన్న ప్రతి ఒక్కరు నిర్మించుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపుతోందని అన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి రాష్ట్రంలోని ప్రతి జిల్లాలలో ఇందిరమ్మ గృహాలు కొనసాగు తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో సతీష్, తూప్రాన్ మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు సంతోష్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు నవీన్, నాగరాజు గౌడ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు, వెంకటేశం, లక్ష్మణ్, వార్డు సభ్యులు వై రాజు, మహేష్, గిరీష్, ఇందిరమ్మ గృహ లబ్ధిదారులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.