30 June, 2026 | 2:56 AM

నోరి దత్తాత్రేయుడికి ఘన సన్మానం

30-06-2026 12:55 AM

హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మభూషణ్ అందుకున్న ప్రముఖ భారతీయ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడును మెడిక వర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ఘనం గా సత్కరించింది. ఈ సందర్భంగా క్యాన్సర్ చికిత్సలో ఆధునిక సాంకేతికత, భారతదేశంలో ఆంకాలజీ భవిష్యత్, నాణ్యమైన క్యాన్సర్ వైద్య సేవల విస్తరణపై ఆయన వైద్య బృందంతో చర్చించారు. మెడికవర్ హాస్పిటల్స్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ సెంటర్ హెడ్ డా. ఎ. శరత్ రెడ్డి మాట్లాడుతూ.. క్యా న్సర్ వైద్య రంగానికి డా. నోరి అందించిన సేవలకు పద్మభూషణ్ అత్యంత సముచిత గౌరవమని, ఆయన యువ వైద్యులకు స్ఫూర్తిగా నిలుస్తారని అన్నారు.

మెడికవర్ ఆంకాలజీ కన్సల్టెంట్ డా. రిగ్వేద్ నిట్టాల మాట్లాడుతూ, డా. నోరి రోగి కేంద్రిత వైద్య సేవలకు ఆదర్శమని పేర్కొన్నారు. డా. నోరి దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. ప్రపంచ స్థాయి క్యాన్సర్ చికిత్స ప్రతి రోగికి అందుబాటులోకి రావడమే తన లక్ష్యమని, ఈ గౌరవానికి మెడికవర్ యాజమాన్యం, వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ ఆంకాలజీ విభాగం మెడికల్ ఆంకాలజిస్ట్ డా. మాధాల రవికృష్ణతో పాటు సీనియర్ కన్సల్టెంట్లు, వైద్యులు, నర్సింగ్, ఇతర వైద్య సిబ్బంది పాల్గొన్నారు.