12 August, 2026 | 11:27 AM

ఉప సర్పంచ్‌ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడికి ఘనంగా సన్మానం

12-08-2026 12:44 AM

తాడ్వాయి, ఆగష్టు, 11 (విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కన్కల్ గ్రామంలో మంగళవారం నూతనంగా ఏర్పడిన ఉప సర్పంచ్ ల ఫోరం జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన చాకలి మహేష్ ను ప్రతినిధులు ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కన్కల్ గ్రామ ఉపసర్పంచ్ అయిన మహేష్ జిల్లా పోరంలో ఉపాధ్యక్షుడిగా ఎన్నికవ్వడం మాకు గర్వంగా ఉందని తెలిపారు.స్థానిక సంస్థల బలోపేతానికి మరింత కృషి చేయాలని వారు కోరారు.ఈ కార్యక్రమంలో సదాశివ నగర్ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షులు పులగం సాయి రెడ్డి, గ్రామ సర్పంచ్ మైలారం రవీందర్ రెడ్డి, నాయకులు మైలారం సంతోష్ రెడ్డి, గడ్డం సంతోష్ రెడ్డి, చుక్క కాషా గౌడ్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.