ఏఎస్ఐ వెంకటేశ్వర్లుకు ఘన వీడ్కోలు
01-09-2026 10:04 AM
ఇల్లందు డిఎస్పి వెంకన్న బాబు ఆధ్వర్యంలో ఘన సన్మానం
శాలువాలతో సత్కరించిన వ్యాపారస్తులు, పాత్రికేయులు
ఆళ్ళపల్లి సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): ఆళ్లపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఐదేళ్ల పాటు ఏఎస్ఐగా సేవలందించి పదవీ విరమణ పొందిన సీహెచ్ వెంకటేశ్వర్లును ఇల్లందు డీఎస్పీ వెంకన్నబాబు, పోలీస్ సిబ్బంది, వ్యాపారులు, గ్రామస్తులు ఘనంగా సత్కరించారు. నేర నియంత్రణలో ఆయన కీలక పాత్ర పోషించడంతో పాటు అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు కొనసాగించారని కొనియాడారు. వీడ్కోలు కార్యక్రమంలో ఎస్సై సోమేశ్వరరావు, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.






