1 September, 2026 | 10:20 AM

జిన్నారం ప్రజావాణిలో ఖాళీ కుర్చీల దర్శనం

01-09-2026 10:09 AM

ఖాళీ కుర్చీలకే వినతి పత్రాలు 

జిన్నారం, సెప్టెంబర్ 1(విజయక్రాంతి): జిన్నారంలో ప్రజావాణి కార్యక్రమం సోమవారం ఉదయం సమయానికి ప్రారంభం కాకపోవడం, అధికారులెవరూ అందుబాటులో లేకపోవడంతో ప్రజలు గంటల తరబడి వేచిచూడాల్సివచ్చింది. గ్రామాల నుంచి తమ సమస్యలపై వినతి పత్రాలు ఇచ్చేందుకు వచ్చిన మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బాధ్యత వహించాల్సిన అధికారులు గైర్హాజరు కావడం వల్ల అర్జీదారులు ఖాళీ కుర్చీలకే వినతి పత్రాలు సమర్పించాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీనిపై జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.