1 September, 2026 | 11:00 AM

కోడిపందాల స్థావరాలపై పోలీసుల మెరుపు దాడి

01-09-2026 09:59 AM

బెజ్జూర్ ఆగస్టు 31 {విజయ క్రాంతి}: బెజ్జూర్ మండలం మర్దిడి గ్రామ శివారులో కోడిపందాల స్థావరంపై పోలీసులు మెరుపు దాడి చేశారు. పుంజులకు కత్తులు కట్టి బెట్టింగ్ నిర్వహిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు కత్తులు, రెండు కోడి పుంజులు, రూ.1,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. మరో ముగ్గురు పరారయ్యారు. వారికోసం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.