1 September, 2026 | 12:15 PM

దేశవ్యాప్తంగా పెరిగిన ఎల్పీజీ ధరలు

01-09-2026 11:17 AM

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా వాణిజ్య గ్యాస్ వినియోగదారులకు కేంద్రం మరోసారి షాకిచ్చింది. ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ సంస్థలు (OMCs) 19 కిలోల వాణిజ్య ఎల్‌పీజీ సిలిండర్ల(Commercial cylinder prices hiked ) ధరలను రూ. 9.50 మేర పెంచాయి. అలాగే, దేశీయ విమానయాన సంస్థలకు సంబంధించిన ఏవియేషన్ టర్బైన్ ఇంధనం (ATF) ధరలు 5.46 శాతం, లీటరుకు రూ. 6.28 చొప్పున పెరిగాయి. పెంచిన ధరలు మంగళవారం నుంచే అమల్లోకి వచ్చాయి. ATF ధరను లీటరుకు రూ. 115 నుండి రూ. 121.28కి పెంచారు. రెండు నెలల పాటు తగ్గుదల తర్వాత గ్యాస్ ధర పెంచారు. అదే సమయంలో గృహ వినియోగ సిలిండర్ ధరలో మాత్రం ఎటువంటి మార్పు చేయకపోవడంతో సామాన్యులు ఊపిరిపీల్చుకున్నారు.