17 April, 2026 | 2:49 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

ధాన్యం కొనుగోలు వివరాలను వెంటనే ట్యాబ్‌లో నమోదు చేయాలి

19-11-2025 12:41 AM

కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్

సూర్యాపేట, నవంబర్ 18 (విజయక్రాంతి) : ధాన్యం కొనుగోలు వివరాలను సకాలంలో ట్యాబ్ లో నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం లోని సమావేశం మందిరంలో మంగళవారం ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహించే ఐకేపి, పిఏసిఎస్, మెప్మా, ఎఫ్‌పిఓ లకు చెందిన అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు.

రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసి మిల్లులకు తరలించిన వెంటనే బిల్లులను పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ కార్యాలయంలో సమర్పిం చాలన్నారు. అప్పుడే వేగవంతంగా రైతుల అకౌంట్ లో డబ్బులు జమ చేసేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలు విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు కలెక్టర్ కే సీతారామారావు, డిఎస్‌ఓ మోహన్‌బాబు, డిఎం రాము, డిసిఓ ప్రవీణ్ కుమార్, వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, అధికారులు  పాల్గొన్నారు.