6 June, 2026 | 2:55 PM

15 వేల క్వింటాళ్ల ధాన్యం సేకరణ పూర్తి

06-06-2026 01:42 PM

తంగళ్ళపల్లి, జూన్ 6 (విజయక్రాంతి): రైతుల ఇబ్బందులు తొలగించేందుకు ముందుకొచ్చిన స్థానిక నాయకత్వం రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల కేంద్రంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం సేకరణ ప్రక్రియ విజయవంతంగా పూర్తయింది. సుమారు 15 వేల క్వింటాళ్లకు పైగా ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైస్ మిల్లులకు తరలించింది.ధాన్యం రవాణాలో ఎలాంటి ఆటంకాలు కలగకుండా స్థానిక సర్పంచ్ మోర లక్ష్మీరాజం, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నేరళ్ల నరసింహం గౌడ్ ప్రత్యేక చొరవ తీసుకుని ట్రాక్టర్ యజమానులతో సమన్వయం చేశారు. దీంతో రైతులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తమ ధాన్యాన్ని కొనుగోలు కేంద్రానికి తరలించి, సకాలంలో మిల్లులకు పంపించే అవకాశం లభించింది.

కొనుగోలు ప్రక్రియ పూర్తికావడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ సహకరించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. రైతుల పక్షాన నిలబడి రవాణా సమస్యలను పరిష్కరించడంలో నాయకత్వం కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ బండి దేవదాస్ గౌడ్, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రవీణ్ , పీఏసీఎస్ వైస్ చైర్మన్ రమణారెడ్డి, ఉప సర్పంచ్ శ్రీకాంత్ రెడ్డి, నాయకులు గంగ హనుమాన్లు, ఆసాని జనార్దన్ రెడ్డి, విజయ్, రైతులు, పీఏసీఎస్ సిబ్బంది నరేష్, రమేష్, శ్రీకాంత్, ప్రవీణ్, హమాలీ సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు