ఎక్వాయిపల్లిలో 99 రోజుల కార్యాచరణ గ్రామసభ
నాలుగు రకాల చెత్తబుట్టల పంపిణీ
కడ్తాల్, జూన్ 6(విజయక్రాంతి): గ్రామ వికాసంలో భాగంగా ఎక్వాయిపల్లి గ్రామంలో '99 రోజుల కార్యాచరణ' గ్రామసభను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ పాలకుర్ల కరుణాకర్ గౌడ్, ఎంపీవో లాలయ్యతో కలిసి గ్రామంలో తడి, పొడి, సానిటరీ ,స్పెషల్ కేర్ చెత్త కుండీల (నాలుగు రకాల డబ్బాల) వినియోగాన్ని ప్రారంభించి, ప్రతి ఇంట్లో వీటిని తప్పనిసరిగా వాడాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కడ్తాల్ సీఐ సైది రెడ్డి మాట్లాడుతూ యువత గంజాయి, మద్యం, ఈవ్ టీజింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉంటూ, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.సమావేశం లో ఉప సర్పంచ్ లక్ష్మి యాదయ్య, సెక్రటరీ నిరంజన్, వార్డు సభ్యులు మరియు గ్రామ నాయకులు పాల్గొని పెన్షన్లు, ఇందిరమ్మ ఇండ్లు, గ్రామ అభివృద్ధి పనులపై సుదీర్ఘంగా చర్చించారు.






