8 May, 2026 | 8:42 AM

పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్‌ను కలిసిన జీపీ ట్రిబ్యునల్ చైర్మన్‌రామ్‌రెడ్డి

08-05-2026 12:00 AM

రంగారెడ్డి, మే 7 (విజయక్రాంతి): తెలంగాణ గ్రామ పంచాయతీ ట్రిబ్యునల్ చైర్మన్గా నూతనంగా నియమితులైన సూదిని రామ్ రెడ్డి గురువారం పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా తనకు ట్రిబ్యునల్ చైర్మన్గా అవకాశం కల్పించినందుకు రామ్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మహేష్ కుమార్ గౌడ్ ఆయనకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి అభినందనలు తెలియజేశారు. ఈ పదవిలో రామ్ రెడ్డి సమర్థవంతంగా పనిచేసి పంచాయతీల బలోపేతానికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చల్ల నరసింహారెడ్డి, రాష్ట్ర యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి పాలకూర్ల రవికాంత్ గౌడ్ లు పాల్గొన్నారు.