12 May, 2026 | 11:40 AM

Breaking News

మావోయిస్టులకు షాక్.. తెలంగాణ పోలీసుల ఎదుట మరో అగ్రనేత   •   సీఎం విజయ్ సంచలన నిర్ణయం— మద్యం దుకాణాలు బంద్   •   కస్తూర్బాగాంధీ విద్యాలయంలో అదనపు గదుల నిర్మాణం కోసం భూమి పూజ   •   వడదెబ్బతో ఉపాధి కూలి మృతి   •   చంద్రు తండా వద్ద అగ్నికీలల్లో రెండు లారీలు.. భయానక రోడ్డు ప్రమాదం   •   తమిళ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్! అన్నాడీఎంకేలో చీలిక.. విజయ్‌ TVKకి మద్దతు   •   రైతుల కష్టానికి ప్రతిఫలం దక్కేలా ప్రభుత్వం పని చేస్తుంది   •   అర్ధరాత్రి అంతర్‌జిల్లా చెక్‌పోస్ట్‌ను తనిఖీ చేసిన డీసీపీ   •   వేధిస్తే షీ టీమ్స్‌ను ఆశ్రయించండి   •   ఆహార భద్రతలో నాణ్యత ప్రమాణాలు పాటించాలి   •  

ప్రజల సహకారంతోనే జీపీ ఎన్నికలు ప్రశాంతం

20-12-2025 01:03 AM

నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య 

నిజామాబాద్ డిసెంబర్ 19 (విజయ క్రాంతి): నిజామాబాద్ జిల్లా ప్రజలు, పోలీసు అధికారుల మధ్య సమన్వయంతోనే గ్రామ పంచాయతీ ఎన్నికలు నజా వుగా నిర్వహించడానికి ఎంతో తోడ్పాటు జరిగిందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు. నిజామా బాద్ జిల్లాలో గ్రామ పంచాయితీ ఎన్నికల షెడ్యూల్డు వెలువడిన నాటి నుండి డిసెంబర్ 17 వరకు ఎటువంటి అవాంచనీయ  సంఘటనలు జరగకుండా కృషి చేసిన అన్ని రాజకీయ పార్టీలకు, ప్రజలందరికి కృతజ్ఞతలు తెలిపారు. శాంతి భద్రతల కోసం కిందిస్థాయి ఉద్యోగుల నుంచి ఉన్నతాధికారుల వరకు ఎనలేనికృషి చేశారన్నారు.