15 July, 2026 | 9:30 AM

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉక్కపోతే..!

15-07-2026 09:27 AM

బోధన్,జూలై15(విజయక్రాంతి): గడిచిన 24 గంటల్లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో(Nizamabad district) ఉష్ణోగ్రతల పెరిగి ప్రజలు ఉక్కపోతకు గురయ్యారు. రాత్రివేళల్లో సైతం వేసవి కాలాన్ని తలపించింది. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా పోతంగల్ లో 38.4°C, కామారెడ్డి జిల్లా కొల్లూరు 38.2°Cల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఉమ్మడి జిల్లాలోని మిగతా ప్రాంతాల్లో 34°C నుంచి 38 °Cల మధ్య నమోదయ్యాయి. కాగా ఆకాశం నిర్మానుష్యంగా మారి వర్షాభావ పరిస్థితితో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.

జిల్లాలో వాతావరణం

రోజు రోజుకూ వేడెక్కుతోంది. తీవ్రమైన ఎండవేడిమి, ఉక్కపోత, చెమటలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. జూలై రెండో వారం దాటినప్పటికీ జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అదనంగా ఉష్ణోగ్రతలు పెరుగుతుండడం గమనార్హం రైతులు ఆందోళన చెందుతున్నారు. వేసిన వరి నాట్లు బీటలు పాడుతున్నాయి. ఒకవైపు వరి నారు మల్లు లో ఎండిపోతున్నాయి, ఇదే పరిస్థితి ఇంకా రెండు వారాలు ఇలాగేఉంటే రైతుల పరిస్థితి ఆందోళన చదువుతారు.