15 July, 2026 | 11:13 AM

హుడ్కిలి శివారులో పులి సంచారం.. రెండు పశువులపై దాడి

15-07-2026 10:48 AM

బర్రె దూడ మృతి.. మరో బర్రెకు తీవ్ర గాయాలు

ఆసిఫాబాద్ (విజయక్రాంతి): ఆసిఫాబాద్ జిల్లా(Asifabad District) సిర్పూర్ (టి) మండలం హుడ్కిలి గ్రామ శివారు ప్రాంతంలో బుధవారం తెల్లవారుజామున పెద్దపులి రెండు పశువులపై దాడి చేసింది. ఈ ఘటనలో ఒక బర్రె దూడ అక్కడికక్కడే మృతి చెందగా, మరో బర్రె తీవ్రంగా గాయపడింది.స్థానికులు సమాచారం ఇవ్వడంతో అటవీ శాఖ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.

ఘటనాస్థలంలో పులి పాదముద్రలను గుర్తించి, దాడి పెద్దపులే చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. గాయపడిన పశువుకు చికిత్స  చేపట్టారు.గ్రామ శివారు ప్రాంతంలో పులి సంచరిస్తున్న నేపథ్యంలో ప్రజలు, పశువుల కాపరులు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు సూచించారు. రాత్రి వేళల్లో అడవి  ప్రాంతాలకు వెళ్లవద్దని, పులి కనిపిస్తే అటవీ అధికారులకు సమాచారం అందించాలని కోరారు.