15 July, 2026 | 11:11 AM

సోనాల వైన్ షాప్ అర్ధరాత్రి లో దొంగతనం

15-07-2026 10:46 AM

బోథ్, జూలై 15 (విజయక్రాంతి): సోనాల మండల కేంద్రంలోని వైన్ షాపులో బుధవారం అర్ధరాత్రి దొంగతనం జరిగింది ఈ సంఘటనలో వైన్ షాప్ నుండి  ఒక లక్ష 50 వేల రూపాయల విలువైన మద్యాన్ని ఎత్తుకెళ్లినట్లు తెలిసింది కాగా వైన్ షాప్ కు చెందిన రెండు సెక్టర్లను లను ధ్వంసం చేసి వైన్ షాప్ కు ఎదురుగా ఉన్న సీసీ కెమెరాలను సైతం ధ్వంసం చేసి మద్యం తీసుకు వెళ్లినట్లు నిర్వాహకులు అంటున్నారు. కాగా దొంగతనం జరిగిన విషయాన్ని పోలీస్ స్టేషన్ లో సమాచారం ఇవ్వడంతో ఉదయం పూట ఎస్సై పురుషోత్తం సంఘటనా స్థలానికి చేరుకొని దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు జాగిలాలతో క్లూస్ టీం వారు పరిశీలించారు