13 May, 2026 | 12:50 PM

Breaking News

విజిల్ గుర్తు.. తమిళనాడు చరిత్ర మార్చింది: సీఎం విజయ్   •   బాన్సువాడ ఆర్డీవో గా రవీందర్ రెడ్డి   •   వడదెబ్బపై అవగాహన.. ఓఆర్‌ఎస్ ప్యాకెట్ల పంపిణీ   •   సత్తుపల్లి నుంచి అంకంపాలెం వరకు నూతన బస్ సర్వీస్ ప్రారంభించిన ఎమ్మెల్యే జారె   •   బలపరీక్షలో నెగ్గిన విజయ్‌ సర్కార్.. అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్   •   షాద్‌నగర్ బైపాస్‌లో ప్రమాదం..!   •   అండర్ డ్రైనేజీ వేసాకే సీసీ రోడ్లు వేయండి   •   రేపు అశ్వారావుపేటలో రాష్ట్రస్థాయి పామాయిల్ రైతుల ఆత్మీయ సమావేశం   •   కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అస్వస్థత.. గురుగ్రామ్ ఆసుపత్రిలో చేరిక   •   ములాయం సింగ్ కుమారుడు హఠాన్మరణం— అఖిలేష్ యాద‌వ్ ఇంట్లో తీవ్రవిషాదం   •  

వికలాంగుల సంక్షేమానికి ప్రభుత్వాలు చొరవ చూపాలి

04-12-2025 12:00 AM

మిర్యాలగూడ, డిసెంబర్ 3 (విజయక్రాంతి): వికలాంగుల సంక్షేమానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలని విహెచ్పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎండి అహ్మద్ ఖాన్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు దైవ సత్యం మాదిగ, ఎంసిపిఐ రాష్ట్ర నాయకులు వస్కుల మట్టయ్య లు కోరారు. బుధవారం ప్రపంచ వికలాంగుల దినోత్సవం సందర్భంగా మిర్యాలగూడ ఎంపీడీవో కార్యాలయ ప్రాంగణంలో కేక్ కోసి మొక్కలు నాటి మాట్లాడారు. వికలాంగులకు విద్య,  ఉద్యోగాలతో పాటు రాజకీయంగా అధిక ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. 

ప్రత్యేక నిధి కేటాయించి వారికీ అవసరం అయిన ఉపకరణాలు సంక్షేమ పథకాలు అమలు చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రకటించిన ప్రకారం వికలాంగులకు 6 వేలు, వృద్ధులకు 4 వేలు పింఛన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.  ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘం జిల్లా జాయింట్ సెక్రెటరీ పోలేపల్లి సురేందర్,  పట్టణ అధ్యక్షులు దైద శ్రీనివాస్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షులు రాజ్ కుమార్, జోజి సైదులు, గోవిందయ్య, మల్లయ్య యాదవ్, రాకేష్ యాదవ్, బాలకృష్ణ, నర్సింహా, దైద సంజయ్, ఆంజనేయులు, పోతుగంటి కాశి  తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఎంపీడీఏ కార్యాలయం లో మొక్కలు నాటారు.