పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులు
ప్రజా ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి
పిట్టల ఎల్లయ్యపల్లి లో రూ. 35 లక్షలతో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవంలో ప్రభుత్వ విప్ విజయరమణఘ రావు
పెద్దపల్లి,ఓదెల,(విజయక్రాంతి): పెద్దపల్లి నియోజకవర్గంలో రైతులే రాజులని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు, మంగళం ఓదెల మండలంలోని పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామంలో రూ. 15 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు ప్రారంభోత్సవంలో,రూ. 20 లక్షలతో నూతన గ్రామ పంచాయతీ నిర్మాణం కోసం స్థానిక నాయకులతో కలిసి విప్ శంకుస్థాపన, భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు.
ఈ సందర్బంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ... తెలంగాణ ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ రెండేళ్ల మూడు మాసల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టుకోవడం జరిగిందన్నారు. ప్రజాపాలన - ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసుకోవడం జరుగుతుందని, అలాగే ప్రజా ప్రభుత్వంలో పిట్టల ఎల్లయ్యపల్లి గ్రామానికి ప్రజా ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక రూ. 65 లక్షలు రూపాయల నిధులతో గ్రామ అభివృద్ధి కోసం వెచ్చించడం జరిగిందని, పాఠశాల కాంపౌండ్ వాల్, అంగన్వాడీ భవనం, మహిళా ఐకేపీ సంబంధించిన మహిళా సమైక్య భవనం కోసం వారం రోజుల్లో రూ.5 లక్షల రూపాయల నిధులను మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు.
త్వరలోనే గ్రామపంచాయతీ భవనం నిర్మాణం పూర్తి చేసుకోవడం జరుగుతుందని, గ్రామ ప్రజల ఆలోచన మేరకే గ్రామ అభివృద్ధికి మంచి ప్రణాళికలు వేసుకొని ఆదర్శ గ్రామంగా తీర్చి దిద్దుకుందామని అన్నారు. త్వరలోనే జిల్లా కేంద్రంలో బస్సు డిపో నిర్మాణం పూర్తి అవ్వడంతోనే పిట్టలఎల్లయ్య పల్లి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పిస్తానని, అలాగే ఓదెల నుండి పలు ప్రాంతాలకు ప్రజలు వెళ్లే విధంగా బస్సు సౌకర్యలు కల్పిస్తానని హామీ ఇచ్చారు. కళ్యాణలక్ష్మి/షాది ముబారక్ చెక్కులు అందించడం జరుగుతుందని, అలాగే కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా ద్వారా ఆర్థిక సహాయం, ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులకు అల్పాహారం, మధ్యాహ్న భోజన పథకాలు అమలులోకి తీసుకురావడం జరుగుతుందని తెలిపారు.
దివ్యంగులైన ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెట్రో ఫిట్టేడ్ మోటరైజ్డ్ వాహనలు పంపిణితో పాటు అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను చేరవేసేలా ప్రభుత్వ కృషి చేస్తుందని అన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి అవగాహన కల్పించడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటూ అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందిస్తుందని రాష్ట్రంలో ఎన్ని ఆర్థిక ఇబ్బందులు కలిగినా కూడా సంక్షేమం విషయంలో ఎలాంటి రాజీ లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుందని ప్రభుత్వ విప్ గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్, పిట్టల రవి ఉపసర్పంచ్, శ్రీకాంత్, మండల అధ్యక్షులు మూల ప్రేమ్ సాగర్ రెడ్డి,వార్డు సభ్యులు, అల్ల సుమన్ రెడ్డి, గోపు నారాయణ రెడ్డి, ఏదేలి విజపాల్ రెడ్డి, రెడ్డి రజింకాంత్, ఆకుల మహేందర్, బొంగోని శ్రీనివాస్, బైరి రవి గౌడ్, మార్కెట్ డైరెక్టర్లు సమ్మయ్య, కొమురయ్య, నరేష్, పలు గ్రామాల సర్పంచ్ లు, ఉపసర్పంచ్ లు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.




