7 April, 2026 | 4:55 PM

Breaking News

కన్నాలలో బాలామృతం కార్యక్రమంలో పాల్గొన్న సర్పంచ్ గుడిసె గట్టయ్య

07-04-2026 03:09 PM

మంథని,(విజయక్రాంతి): మంథని మండలం కన్నాల గ్రామంలో ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల భాగంగా మంగళవారం అంగన్వాడీ సెంటర్ లో చిన్నారుల తల్లిదండ్రులకు బాలమృతం కోడిగుడ్లు బలహీనంగా ఉన్న చిన్నారులకు బాలమృతం ప్లస్ ప్యాకెట్లను మంగళవారం గ్రామ సర్పంచ్ గుడిసె గట్టయ్య యాదవ్ చేతుల మీదుగా అందజేశారు.

ఈ సందర్భంగా గ్రామ సర్పంచి మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడి చిన్నారులను జీరో నుంచి ఐదు సంవత్సరాల వరకు ఇక్కడే ఉంచాలని  ప్రభుత్వం ఇచ్చే ఫుడ్డు తినడం వల్ల చిన్నారులు బలంగా తయారవుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు రామగిరి సంపత్ గ్రామ పంచాయతీ కార్యదర్శి మధుకర్, అంగన్వాడీ టీచర్ భాగ్యలక్ష్మి, ఆయాలు సునీత, లింగమ్మ, గ్రామస్తులు జంగిలి శ్రీనివాస్, ఉడుత శ్రీనివాస్, పాల్గొన్నారు.