7 April, 2026 | 5:17 PM

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలి

07-04-2026 03:37 PM

* అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) డిమాండ్

గుండాల,(విజయక్రాంతి): మండలంలో మార్క్ఫెడ్ ద్వారా మొక్కజొన్నలు కొనుగోలు చేయాలని అఖిల భారత రైతు కూలి సంఘం (ఏఐకేఎంఎస్) నాయకులు, గుండాల సర్పంచ్ కొమరం సీతారాములు, గడ్డం లాలయ్య లు డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ... ప్రభుత్వం 2025-26 గాను మద్దతు ధర క్వింటాకు రూ. 2400 ఉండగా ప్రవేట్ వ్యాపారస్తులు 1800 రూపాయలకే కొంటున్నారని, యాసంగి సీజన్లో అనేక కష్టాలు పడుతూ మొక్కజొన్న పంటను పండిస్తే రైతులకు కనీసం పెట్టుబడి కూడా రావట్లేదని వాపోయారు.

ప్రభుత్వం మార్క్ పేడ్ ద్వారా కొనుగోలు చేస్తామని ప్రకటించినప్పటికీ ఇప్పటివరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడంతో రైతులు ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయించాల్సి వస్తుందని అన్నారు. ఇప్పటికైనా మండల తహసీల్దార్, ఎంపీడీవో, మండల వ్యవసాయ శాఖ అధికారులు స్పందించి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ-అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు యాసారపు వెంకన్న, పర్శిక రవి, ఈసం కృష్ణన్న, కల్తి మల్లన్న, మానాల ఉపేందర్, పాయం ఎల్లన్న, బానోతు లాలు తదితరులు పాల్గొన్నారు.