రేపే ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్
- హాజరుకానున్న ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం
- ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛందంగా వాలంటీర్లు రండి
- సెమినార్ కు హాజరయ్యే వాలంటీర్లకు పార్టిసిపేట్ సర్టిఫికెట్
- పీయూ ఎన్ఎన్ఎస్ కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ
పాలమూర్ యూనివర్సిటీ: వికాసిత్ భారత్, 99 ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా పాలమూరు యూనివర్సిటీలో ఎన్ఎస్ఎస్ రాష్ట్ర స్థాయి సెమినార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ప్రవీణ్ అన్నారు. పాలమూరు యూనివర్సిటీలోని ఎగ్జామినేషన్ హాల్ నందు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. పీయూ లోని సెంట్రల్ లైబ్రరీ ఆడిటోరియంలో బుధవారం ఉదయం 10 గంటలకు నిర్వహించే ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్లు స్వచ్ఛందంగా హాజరుకావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమానికి ఎంపీ డీకే అరుణ, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి హాజరు అవుతున్నట్లు తెలియజేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పియు పరిధిలో 1500 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు ఉన్నారని, 100 మంది ప్రోగ్రాం ఆఫీసర్లు ఉన్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి వాలంటీర్లు స్వచ్ఛందంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సమయానికి ప్రతి వాలంటీర్ హాజరుకావాలని హాజరయ్య ప్రతి ఒక్కరికి పార్టిసిపేట్ సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుందని స్పష్టం చేశారు.
దేశభక్తితో పాటు సమాజానికి మేలు చేసే ఎన్నో అంశాలను ప్రముఖులు తెలియజేయడం జరుగుతుందని ఈ సెమినార్ గొప్ప ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో రాఘవేందర్, చేగుంటి రవికుమార్, ఈశ్వర్, జ్ఞానేశ్వర్, గాలేన్న తదితరులు ఉన్నారు.




