7 April, 2026 | 5:21 PM

అరెస్ట్ తర్వాత హరీశ్ రావు ఫైర్: రేవంత్ పాలనపై సంచలన ఆరోపణలు… ఎన్నికలపై షాకింగ్ కామెంట్స్!

07-04-2026 03:30 PM
  1. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కూడా రాదు
  2.  'మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది'
  3. రేవంత్ రెడ్డి నువ్వు మళ్లీ గెలుస్తా అనేది పగటి కల
  4. CMకు భూములపై ఉన్న శ్రద్ధ పాలనపై లేదు

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు హరీశ్ రావు(BRS MLA Harish Rao) కౌంటర్ ఇచ్చారు. శంషాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి హరీశ్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ నేతలు విడుదలయ్యారు. అనంతరం హరీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ... 'రేవంత్ రెడ్డి నువ్వు మళ్లీ గెలుస్తా అనేది పగటి కల.. తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ వచ్చేది, రామ రాజ్యం, కేసీఆర్ రాజ్యం' అన్నారు. కాంగ్రెస్ పార్టీకి కు ప్రతిపక్ష హోదా కూడా రాదని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కాంగ్రెస్ కు వచ్చేది సింగిల్ డిజిట్ మాత్రమే అన్నారు.


తెలంగాణ రాజకీయాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి – హరీశ్ రావు అరెస్ట్ తర్వాత కీలక పరిణామాలు తెలుసుకోండి


రేవంత్ రెడ్డి పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని హరీశ్ రావు ధ్వజమెత్తారు. ప్రతిపక్షాలు కనీసం ప్రశ్నించ వద్దని, ధర్నాలకు పోవద్దని అంటున్నారని మండిపడ్డారు. ప్రశ్నిస్తే కేసులు, విచారణలు, విజిలెన్స్ కేసులు అంటున్నారని ఆరోపించారు. 'మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది?' అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వాళ్లే చెప్పారని ఇండస్ట్రియల్ పార్కుల పేరిట పేదల భూములను లాక్కుంటున్న రేవంత్ సర్కార్ పై నిరసన తెలుపుతున్న రైతులతో సమావేశమయ్యేందుకు పరిగికి వెళ్తున్న హరీష్ రావును, పలువురు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్టు(Harish Rao Arrest ) చేశారు. ఇదిలా ఉండగా, బీఆర్ఎస్ నాయకులు పరిగిని సందర్శించడానికి ముందే, సోమవారం అర్ధరాత్రి నిరసన తెలుపుతున్న రైతులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిని పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.