6 April, 2026 | 6:16 PM

ఉమామహేశ్వరంలో ప్రభుత్వ విప్ ప్రత్యేక పూజలు

06-04-2026 04:05 PM

అచ్చంపేట: శ్రీశైలం ఉత్తర ద్వారంగా భాసిల్లుతోన్న శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయాన్ని తెలంగాణ శాసనసభ విప్ బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ నిర్వాహకులు ఘన స్వాగతం పలికారు. ఆలయంలోని ఉమాసదులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వినాయకుడు, అయ్యప్ప స్వామి మహిషాసురమర్ధిని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ విశిష్టతను అర్చకులు వివరించారు. హాయ్ అను మర్యాదపూర్వకంగా సన్మానించారు. అర్చకులు వీరేశాస్త్రి తీర్థ ప్రసాదన్న అందించి ఆశీర్వదించారు. ఆలయ నిర్వాహకులు,  సిబ్బంది పాల్గొన్నారు.